ప్రగతి భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 588 దరఖాస్తులు అందాయి. మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంభందించి 221, పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు 98, విద్యుత్ శాఖకు 84, రెవెన్యూ పరమైన సమస్యలపై 55, ప్రవాసి ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు 126 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డా, చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య పాల్గొన్నారు.