కార్వాన్ నియోజకవర్గ పరిధిలోనీ వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ది పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కౌసార్ మొహియుద్దీన్ మంగళవారం పరిశీలించారు. మురుగు నీటి లైన్, విధి లైట్లు సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలపడంతో వారి సూచన మేరకు అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.