ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలను స్మరించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మాల మహానాడు ప్రెసిడెంట్ మీసం లవ కుమార్ అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని ఇంద్రానగర్ లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.