ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని పలు అర్జీలను స్వీకరించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ సూచించారు. సమస్యలు పరిస్కరించడంపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.