నల్లకుంట డివిజన్ లో రూ. 7. 25 లక్షల నిధులతో చేపడుతున్న మంచినీటి పైపు లైన్ పనులకు డివిజన్ కార్పొరేటర్ అమృతతో కలిసి అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. పైపులైన్ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు, కాంట్రాక్టు సిబ్బందికి సూచించారు.