ఆసియా పవర్ ఇండెక్స్ (ఏపీఐ) 2024 గణాంకాల ప్రకారం ఆసియాలో భారత్ 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది. మూడో స్థానంలో ఉన్న జపాన్ను తోసిరాజని భారత్ మూడో స్థానానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉన్నట్లు ఏపీఐ వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 27 దేశాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం ద్వారా ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్ ఈ సూచికను రూపొందిస్తోంది.