వంగూర్ మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ మురళీమోహన్ అన్నారు. మంగళవారం వంగూరు మండలంలోని ఉప్పల్ పహాడ్, గాజర గ్రామాలను పరిశీలించారు. అనంతరం సర్వే చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. తప్పులు లేకుండా కుటుంబ యజమాని ద్వారా పూర్తి వివరాలు సేకరించి నమోదు చెయ్యాలని తహశీల్దార్ మురళీమోహన్ తెలిపారు.