గ్రామాలలో, పట్టణాలలో మౌలిక వసతులను కల్పించి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కడుతున్నదని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం లింగాల మండలం శ్రీరంగాపురం, కే. సి తండా పాలలో గ్రామపంచాయతీ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన, ఎర్ర పెంటలో 60 లక్షల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. చెంచుపెంటల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.