పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కే. సీతారామారావు రేషన్ గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గోదామును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే వచ్చిన స్టాక్ ను డీలర్లకు టైమ్ కు సప్లై చేయాలని పెద్దకొత్తపల్లి మండలం ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఎండి. రావూఫ్ ను ఆదేశించారు. వీరితోపాటు కొల్లాపూర్ ఆర్డీవో యాదగిరి, పెద్దకొత్తపల్లి మండలం తాహశీల్దార్ జెకే. మోహన్ ఉన్నారు.