నాగర్ కర్నూల్ ప్రజావాణికి 43 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.