ఏపీలో మరో సమ్మెకు యూనియన్లు పిలుపునిచ్చాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లు శుక్రవారం సమ్మె సైరన్ మోగించాయి. ఈ క్రమంలో కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. 14 రోజుల్లో జీతాల సమస్య పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని సంఘాలు హెచ్చరికలు జారీచేశాయి.