మక్తల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. గుడిగండ్లకు చెందిన ఆశప్పకు రూ. 22, 000, గార్లపల్లికి చెందిన లక్షమప్పకు రూ. 46, 500 విలువ గల చెక్కులను అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ప్రభుత్వం వైద్య చికిత్సల కొరకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.