జడ్చర్ల: టీటీడీ అధికారులపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులపై సోమవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన భక్తులు తిరుమలకు వస్తే ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే తాము కఠిన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. తెలంగాణ, ఏపీ సోదరుల మాదిరి మెలగాలన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరారు.