కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మార్కెట్ కు ధాన్యం తీసుకొని వచ్చిన రైతులకు మంచి సేవలు అందించాలని కోరారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగకుండా మార్కెట్ యార్డ్ లో రైతులకి అన్నిసౌకర్యాలు కల్పిస్తూ ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు.