ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. అతనిని కడప పీఎస్ కు తరలించారు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్, వంగలపూడి అనితపై రవీంద్ర అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఇటీవల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.