మహబూబ్ నగర్: దివిటి పల్లి ఐటి పార్క్ ను శుక్రవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. అమర రాజా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇంకా కొంత భూసేకరణ పరిహారం అందలేదని చెప్పారు. వెంటనే రైతుల నుంచి చేసిన భూసేకరణకు సంబంధించిన పరిహారం అందజేయాలని మంత్రి కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.