దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలంలో ఐకెపి సెంటర్ ను బుధవారం బిజెపి ఇన్ ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. వరి కొనుగోలు ప్రారంభించి రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లో ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు లక్షకు పైగా సంచులు అవసరం ఉన్నప్పటికీ 5000 సంచులు మాత్రం వచ్చాయని అధికారులు చెప్పారు. 14% రైతుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. వెంటనే వరి కొనుగోలు ప్రారంభించకపోతే రైతుల పక్షాన నిలబడి ఆందోళన చేస్తామన్నారు.