ఈవీఎంలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని అన్నారు. ఆరు నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలించి వినియోగిస్తామని స్పష్టం చేశారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందే బ్యాటరీలను, సింబల్స్‌ను అమర్చుతామని, మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయని పేర్కొన్నారు.