సీఎం రేవంత్ రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు, మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఉదయాన్నే ఇళ్లల్లోకి వెళ్లి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్ట్‌లపై నేతలు మండిపడుతున్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.