పార్టీ సభ్యత్వ నమోదులో మొదటి పది స్థానాల్లో ఉన్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సభ్యత్వ నమోదుపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనతికాలంలోనే సభ్యత్వాలను 52 లక్షలకు చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని.. ఇదొక చరిత్ర అని అన్నారు.