ఇచ్చోడా మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి శనివారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడబ్ల్యూఆర్ బాలిక వసతిగృహం, శాంఘిక సంక్షేమ, మైనారిటీ వసతి గృహలను అయన సందర్శించారు. విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో పాఠశాల విద్యను మెరుగుపరచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని అయన పేర్కొన్నారు.