సోషల్ మీడియాలలో తప్పుడు సమాచారం, నిరాధార వార్తలను వ్యాప్తి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బోథ్ ఎస్ఐ ప్రవీణ్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. బోథ్ సీహెచ్సీలో గత మార్చిలో వైద్యులు శస్త్రచికిత్స చేయటంతో ఓ మహిళ మృతి చెందిందని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించారని సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.