ఎమ్మెల్యే శంకర్ పై కోడ్ ఉల్లంఘన కేసు

1067பார்த்தது
ఎమ్మెల్యే శంకర్ పై కోడ్ ఉల్లంఘన కేసు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు నమోదు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని రాముడి చిత్రాలతో పాటు ఎమ్మెల్యే చిత్రం ఉన్న ప్లెక్సీలను ఏర్పాటు చేశారని, వీటికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోలేదని ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.

தொடர்புடைய செய்தி