సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా రూపమాపాలని సఖి కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లోని స్పిన్నింగ్ మిల్లు పనిచేస్తున్న కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాలు, హెల్ప్ లైన్ నంబర్స్, సఖి కేంద్రం సేవలను వివరించారు. సఖి కేంద్రం కు వచ్చిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని కేస్ వర్కర్ నాగమణి తెలిపారు. మహిళా సాధికారత కోఆర్డినేటర్ యశోద, తదితరులున్నారు.