AP: మద్యం తాగడానికి దాచుకున్న డబ్బులు ఇవ్వలేదని కన్నకూతురిని వైరుతో ఉరివేసి ఓ కసాయి తండ్రి కిరాతకంగా చంపాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోనాలో నిన్న చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలు పదేళ్ల బాలిక మౌనికగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.