ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శీతాకాలం నేపథ్యంలో ఇప్పటికే కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసి వేశారు. ఇక, నవంబరు 17న బద్రీనాథ్ ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. కాగా, అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 246 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 242గా మృతిచెందారు.