Feb 01, 2025, 14:02 IST/జుక్కల్
జుక్కల్
పిట్లంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు
Feb 01, 2025, 14:02 IST
పిట్లం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి జయంతి సందర్భంగా మండల కేంద్రంలో శనివారం శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు కోలాటాలాడుతూ పట్టణ పురవీధులలో డీజే చప్పులతో మహిళలు నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమన్ని సంఘ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సన్నపుల మధు, పట్టణ అధ్యక్షులు గుర్రపు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.