May 15, 2024, 03:05 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
మహిళా సాధికారత ప్రతి ఒక్కరి బాధ్యత
May 15, 2024, 03:05 IST
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ పరిశ్రమలో పనిచేసే మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారతపై మంగళవారం అవగాహన కల్పించారు. జిల్లా మహిళా సాధికారత ఫైనాన్షియల్ లిట్రసి సంధ్య హాజరై ఆర్ధిక అక్షరాస్యతతోనే మహిళలకు చేయూత అన్నారు. మహిళ సాధికారత సాధించడం ప్రతి ఒక్కరి భాధ్యతని, అందుకు ప్రతి ఒక్క మహిళ తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు రజిని, అఖిలేష్, మహిళలు పాల్గొన్నారు.