Dec 22, 2024, 07:12 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం
Dec 22, 2024, 07:12 IST
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫమైందని జగిత్యాల జిల్లా దివ్యాంగుల సంఘ నాయకుడు అస్గర్ మహమ్మద్ ఖాన్ అన్నారు. ఆదివారం ఆయన జగిత్యాలలో మాట్లాడుతూ దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. దివ్యాంగులకు ప్రతినెలా పెన్షన్ రూ. 6000 ఇస్తామని, చేయూత పథకం కింద నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంత వరకు నెరవేర్చలేదన్నారు.