కడప: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు. ఆ క్రమంలో గురువారం ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో పోలీస్‌స్టేషన్‌కు ఆమె చేరుకున్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డితోపాటు పలువురిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.