తొండూరు మండలం ఇనగలూరులో రహదారులు అధ్వానంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి ఇనగలూరులోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు వర్షాలకు మరింత అధ్వాన స్థితికి చేరాయి. రోడ్డు ఏదో, గుంతలు ఏవో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రమాదాలు జరగకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరారు.