జీలుగుమిల్లి: అక్రమ మద్యం పట్టివేత
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 మద్యం బాటిళ్లు, ఆంధ్రకు చెందిన 12 మద్యం బాటిళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనుబాబు తెలిపారు.