నిడమర్రు మండలం ఛానమిల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ నిధులు రూ.28లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే మెటల్ రోడ్ల నిర్మాణ పనులకి, గ్రామంలో తుమ్మల చెరువు గట్టు దగ్గర రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సి. సి రోడ్ల నిర్మాణ పనులకి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.