గణపవరం మండలం జల్లి కొమ్మర ప్రాథమికో న్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుందర్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఉపాధ్యాయులు ప్రసాదరావు భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను పిటిక పీఠక గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులచే రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.