మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. శ్రీనివాస్‌తో పాటు జనసేన పార్టీ రాష్ట్ర కార్య దర్శి చాగంటి మురళీకృష్ణ (చిన్నా) ప్రజల వద్ద అర్జీలు స్వీకరించి నమోదు చేసుకుని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.