ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు మంగళవారం విజయవాడ ట్రై కార్ కార్యాలయంలో బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సమావేశంలో ఎస్టీలకు సంబంధించి ఆర్థిక ఎదుగుదలకు, జీవనోపాధి మెరుగు పరచడానికి అందరూ సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించటం జరిగింది. అనంతరం సభ్యులకు సూచనలు, సలహాలు అందజేశారు.