బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం హ్యూమన్ రైట్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు , సమస్యలను బృందం అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు భోజనశాల నిర్వాహణ పై కమిషన్ విజయ భారతి సాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.