త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని వైసీపీ ప. గో. జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు. శనివారం నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటరు నమోదులో భాగస్వాములు కావాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని విద్యావంతులను గుర్తించి వారిని ఓటర్లుగా చేర్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.