విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆచంట మండలం నాలుగు గ్రామాల ప్రజలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 3,00,232/- చెక్కును మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి తహసీల్దారు, సిబ్బంది ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా, కలెక్టర్ నాగరాణి పెద్ద మనసుతో విరాళాలు అందించిన గ్రామ ప్రజలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని అభినందించారు.