నరసాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 11 సాయంత్రం 7 గంటల వరకు పొడిగించినట్లు నరసాపురం సీఐ ఎస్. రాంబాబు బుధవారం తెలిపారు. నరసాపురం పరిధిలో 24 షాపులకు సంబంధించి ఇప్పటివరకు 500 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మద్యం షాపులకు సంబంధించి14వ తేదీన లాటరీ తీసి 16వ తేదీన షాపులను ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.