గోపాలపురం: 'గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గోపాలపురం టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ అన్నారు. నిర్మాణ పనులను సచివాలయ సిబ్బంది బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఎక్కడైతే రోడ్డు లేని పరిసర ప్రాంతాలు ఉన్నాయో అతి త్వరలో రోడ్డు వేస్తామని, రోడ్డు సమస్య గురించి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే నిర్మాణానికి నిధులు కేటాయించారన్నారు.