కొవ్వూరు నుంచి దొండపూడి మీదుగా జీలుగుమిల్లి వరకు నిర్మించబోవు ఎన్. హెచ్ నిర్మాణంపై దొండపూడి వాసులు గగ్గోలు పెట్టారు. ఆరోడ్డు నిర్మాణం 18 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని, తరువాత 22 మీటర్లకు పెంచడంపై ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో గోపాలపురం విచ్చేసిన ఆర్డీవో సుస్మితకు 60 మంది రాతపూర్వక అభ్యర్ధనలు బుధవారం అందజేశారు. ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో చెప్పారు.