ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతతో పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం పీజిఆర్ఎస్లో 236 అర్జీలు స్వీకరించారు. సమస్యలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు .