రేపు జంగారెడ్డిగూడెంలో హెల్మెట్ డ్రైవ్

64பார்த்தது
జంగారెడ్డిగూడెంలో సోమవారం నుంచి హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు డిఎస్పి రవిచంద్ర చెప్పారు. శనివారం జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయంలో రవాణా, పోలీసు అధికారులతో డీఎస్పీ రవిచంద్ర, రవాణా శాఖ అధికారి మధాని సమీక్ష నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్టు ధరించాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ. వెయ్యి జరిమానా తప్పదన్నారు.

தொடர்புடைய செய்தி