బాణాసంచా దుకాణదారులు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని చింతలపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. మంగళవారం చింతలపూడి ఎస్సై కుటుంబరావుతో కలిసి బాణాసంచా దుకాణాలను పరిశీలించారు. దీపావళి సామాన్లు విక్రయించే దుకాణదారులు అందుబాటులో నీరు, ఆక్సిజన్ సిలిండర్లను, ఇసుకను, అన్ని దుకాణాల వద్ద విధిగా అందుబాటులో ఉంచాలి. తగు జాగ్రత్తలు తీసుకొని వారిపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు.