భీమవరం స్థానిక శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల లో ఎన్ ఎస్ ఎస్ వలంటీర్ల చే సోమవారం నాడు ఒక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ శ్రీ ఎమ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రోజు రోజుకీ ఎండలు మండిపోతున్న ఈ సమయం లో తమ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు దప్పిక తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారని తెలియ జేశారు.
ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎన్. అనురాధ మాట్లాడుతూ, కళాశాల ఎదురుగా వున్న రోడ్డులో పాదచారులకు, ఎండలో వుంటూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముకుని షాప్స్ లో ఉండేవారికి, సెక్యూరిటీగార్డ్స్ లకు మొదలగు వారికీ మజ్జిగ పాకెట్స్ అందజేయడం జరిగింది అని తెలియజేసారు. విద్యార్థులు ఎండలో తిరుగుతూ, వీరందరికి అందజేయడం చాలా హర్షించ దగిన విషయం అని తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. మావుళ్లు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ సి హెచ్ వీ వీ బ్రహ్మం, అధ్యాపక సిబ్బంది పీ టీ ఎన్ ఎస్ కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.