ఆచంట మండలం రావిలంకలో కొబ్బరి తోట స్థలానికి సంబంధించిన గొడవలో తనను ఐదుగురు గాయపరచడంతో పాలకొల్లులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చిట్టవరం గ్రామానికి చెందిన గొర్రి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. ఇదే ఘటనలో తనను గొర్రె శ్రీనివాసరావు అనే వ్యక్తి కొట్టి అసభ్యంగా ప్రవర్తించి, చంపుతానని బెదిరించాడని రావిలంకకు చెందిన మహిళ ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరమణ ఆదివారం తెలిపారు.