భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో 146 అర్జీలు
భీమవరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ నాగరాణి స్వీకరించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి 146 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన పద్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.