టిడిపి సభ్యత్వ నమోదులో ఎలమంచిలి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకార గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని పార్టీ కనిపిస్తుందన్నారు. మాజీ సర్పంచ్ ఎం బాపునాయుడు అధ్యక్షత వహించారు.