విశాఖలో వంట నూనెల ధరలు పెరిగాయి. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ బ్రాండ్‌ను బట్టి సగటున కిలో రూ. 110 నుంచి రూ. 120 మధ్య విక్రయించేవారు. నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతి సుంకం పెంచనున్నట్టు వెల్లడించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ డీలర్లు, వ్యాపారులు మాత్రం దానిని సాకుగా తీసుకొని రేట్లు పెంచేశారు. లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారు.